PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి

1 min read

మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు

పాల్గొన్న 79 సచివాలయ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ పాలన మారినప్పటికీ సచివాలయ ఉద్యోగులు వారు బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ మేయర్షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.  స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పాత కౌన్సిల్ హాల్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల రివ్యూ సమావేశానికి మేయర్ నూర్జహాన్ పెదబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వార్డు సచివాలయ వ్యవస్థలో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల యొక్క బాధ్యత ఎంతో కీలకమైనది అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు సచివాలయo అన్ని విభాగాల సెక్రెటరీలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలైన సేవలను సక్రమంగా అందించే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. సమయానికి విధులకు హాజరవ్వడం. సచివాలయ కార్యాలయాన్ని, పరిసరాలను శుభ్రంగ ఉంచుకోవాలన్నారు.   ప్రతిరోజు చేస్తున్న పనిని రిజిస్టర్ మైంటైన్ చేయడం.కమిషనర్ పై అధికారులు అడిగిన వెంటనే సమాచారాన్ని తక్షణమే అందించే విధంగా ఉండాలన్నారు.అధికారులు  అప్పగించిన పనులు సమయానికి పూర్తి చేయాలన్నారు.  సచివాలయ సెక్రటరీలు  పాత లబ్ధిదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడం,అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఆన్లైన్ సేవలను అందిస్తూ వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ఐడెంటిఫై చేయడం. ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని సంపూర్ణంగా వసూలు చేయడం ఎంతో ముఖ్యం అన్నారు. అతి ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఇతర సెక్రటరీ తో కలిసి వారి ప్రాంతాల్లో ఫీల్డ్ వర్క్ చేయడం చాలా అవసరం అన్నారు. ప్రతిరోజు కచ్చితంగా గంటకు పైగా ఫీల్డ్ వర్క్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీలను ఆదేశించారు.అప్పుడే లబ్ధిదారులకు సరైన సేవలు అందించగలం అన్నారు.ప్రజా ప్రతినిధులను గుర్తించి ప్రోటోకాల్ ప్రకారం వారు అడిగిన సమాచారాన్ని అందచేయాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  సంక్రాంతి వెంకటకృష్ణ,కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,అదనపు కమీషనర్ జి.చంద్రయ్య,డిప్యూటీ కమిషనర్  డాక్టర్ ఎన్.రాధా,సెక్రటరీ  దివ్య కుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 79 సచివాలయాల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు పాల్గొన్నారు.

About Author