PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవ్వు..ఓ సంజీవని…!

1 min read

మనిషి ఆయుష్షును పెంచుతుంది…

  • మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది…
  • నిత్య యవ్వనంగా ఉంచుతుంది…
  • హైబీపీ…గుండెనొప్పి దరిచేరనివ్వదు…
  •  లాఫ్​ థెరపిస్ట్​, హ్యాపీ లైఫ్​ కోచ్​ సి.ఎస్​. సలీంబాష , లాఫర్​ యోగా గురువు పోతన

కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక సమాజంలో ‘నవ్వు’ కు దూరమై…. అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు లాఫ్​ థెరపిస్ట్​, హ్యాపీ లైఫ్​ కోచ్​ సి.ఎస్​. సలీంబాష, లాఫర్​ యోగా గురువు పోతన . మానవ సంబంధాలు…స్నేహం….బంధుత్వంకు దూరమైన నవసమాజం.. నవ్వు.. ఉపయోగాలు తెలియక.. నవ్వలేకపోతున్నారు. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ… ఆయుష్షు తగ్గించుకుంటున్నా రన్నారు. ఆదివారం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో జరిగిన లాఫర్​ మెడిసిన్​ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్​ కార్డియలజిస్ట్​, కర్నూలు హార్ట్​ అండ్​ బ్రెయిన్​ మల్టీ స్పెషాలిటీ అధినేత డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో జరిగిన లాఫర్​ మెడిసిన్​ సదస్సుకు లాఫ్​ థెరపిస్ట్​, హ్యాపీ లైఫ్​ కోచ్​ సి.ఎస్​. సలీంబాష విశిష్ట అతిథిగా విచ్చేసి ‘నవ్వు’ తో కలిగే లాభాల గురించి వివరించారు. డాక్టర్​ మదన్​ కటారియా 1998 జనవరి 10న ముంబైలో ప్రారంభించిన లాఫింగ్​ డే కార్యక్రమాన్ని… హాస్య ప్రియుల కోరిక మేరకు ప్రతి సంవత్సరం మే నెలలోని మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంను జరుపుకుంటున్నారు.

నవ్వడం.. ఒక భోగం…

మానసిక రోగులకు సంజీవనిగా మారిన నవ్వు… భావోద్వేగాలకు (ఒత్తిడి) లోనైన వ్యక్తి ఆయుష్షు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు లాఫ్​ థెరపిస్ట్​, హ్యాపీ లైఫ్​ కోచ్​ సి.ఎస్​. సలీంబాష. ప్రస్తుత సమాజంలో ఆహారపు అలవాట్లు… శారీరక వ్యాయామం… లేకపోవడంతో అధిక పని ఒత్తిడికి గురైన వారు (వయస్సుతో సంబంధం లేకుండా) గుండెపోటుతో మృత్యవాత పడుతున్నారు.  ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం… స్నేహత్వం తగ్గిపోవడం… బంధుత్వానికి దూరం కావడం వల్ల మనిషి ఉచితంగా ఆరోగ్యమిచ్చే నవ్వుకు దూరమవుతున్నారు. కంప్యూటర్లు…సెల్​ఫోన్​కు పరిమితమైన యువకులు… శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఇక నవ్వు గురించి..సినిమాలు చూసి తెలుసుకోవాల్సిన దౌర్బాగ్య పరిస్థితి నెలకొందనడంలో అతిశయోక్తి లేదు.  

నవ్వుతో….లాభాలెన్నో….

 నవ్వు… మనిషి తనకు తాను తయారు చేసుకునే అద్బుత సౌందర్య సాధనం. నిత్యయవ్వనులుగా కనపడాలనుకుంటే చిరునవ్వుతో సమాధానం చెప్పాలి.  నవ్వడం వలన శరీరంలోని ప్రతి భాగానికి వ్యాయామం చేసినంత ఫలితం ఉంటుందట. అలాంటి నవ్వుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గట్టిగా నవ్వే వారిలో బీపీని అదుపులో ఉంటుంది. హైబీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడులను నవ్వు అదుపులో ఉంచుతుంది. బాగా నవ్వే సమయంలో శరీరం ఆక్సీజన్‌ను బాగా తీసుకుంటుంది. దీనివల్ల ఎలాంటి హృద్రోగాలు రావు. హాయిగా నవ్వే వారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. ముఖంపై వార్థక్యపు ఛాయలు, ముడుతలు పడనీయకుండా చిరునవ్వు ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. కంటికి, పెదవులకు, బుగ్గలకు నవ్వు ఒక వ్యాయామం వంటిది. నవ్వడం వల్ల మెడకు మంచి వ్యాయామం లభిస్తుంది. నరాల బలహీనత పోయి గట్టి పడతాయి. మెడకు బెల్టు వాడే అవసరమే రాదు. బాగా నవ్వుతున్నప్పుడు శ్వాస ఎక్కువ సార్లు పీల్చుకొని వదలడం వల్ల శరీరంలోని అనేక మలినాలు కార్బన్‌డయాక్సైడ్‌ ద్వారా వెళ్లిపోయి, ఛాతీకి సంబంధించిన అనేక వ్యాధులు దూరమవుతాయని  డాక్టర్​ సలీంబాష వెల్లడించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్​ కల్కూర, తదితరులు పాల్గొన్నారు.

అతిథులకు…ఘనసన్మానం…

నవ్వుతో కలిగే లాభాలు.. నవ్వకపోతే కలిగే నష్టాల గురించి మెడిసిన్​ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించిన లాఫ్​ థెరపిస్ట్​, హ్యాపీ లైఫ్​ కోచ్​ సి.ఎస్​. సలీంబాష , లాఫర్​ యోగా గురువు పోతనను సీనియర్​ కార్డియాలజిస్ట్​, హార్ట్​ ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్​ శాలువ కప్పి  ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డా. శంకర్​ శర్మ, హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు చంద్రశేఖర్​ కల్కూర, మహబూబ్​ బాష తదితరులు పాల్గొన్నారు.

About Author