PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెండింగ్ ఉన్న ఫార్మ్స్ ను త్వరితగతిన పరిష్కరించండి

1 min read

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పెండింగ్ ఉన్న ఫార్మ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.శనివారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ఎన్నికల సన్నద్ధతపై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, డిస్పోజ్ చేసే ప్రతి దరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలించి డిస్పోజ్ చేయాలన్నారు.. జెనరేట్ చేసిన ఎపిక్ కార్డ్స్ త్వరితగతిన పంపిణీ చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఎపిక్ కార్డ్స్ ప్రింటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలని కలెక్టర్ లను అదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ సర్విలియన్స్ టీమ్స్, స్టాటిక్  సర్విలియన్స్ టీమ్స్, వీడియో వీక్షించే  టీం, అకౌంటింగ్ టీమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్ లకు ఈ నెలలో రెండు సార్లు శిక్షణ తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్ లకు సూచించారు. ఎపిక్ కార్డులకు సంబంధించి పోలింగ్ ముందు లోపు అర్హులైన ఓటర్లు అందరికీ ఓటర్ కార్డులు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగుల వివరాలను ఈ నెల 15వ తేది లోపు సేకరించి, 20వ తేది లోపు వాటిని వెరిఫై చేసుకోవాలన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా కలెక్టర్ వివరిస్తూ పెండింగ్ లో ఫార్మ్స్ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎపిక్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు 2.24లక్షల కార్డులను జనరేట్ చేయడం జరిగిందని వాటిలో 1.36లక్షల మేరకు ఓటర్లకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించడం జరిగిందని, కేవలం రెండు ర్యాంపులు, ఒక టాయిలెట్ పనులు పెండింగ్ ఉన్నాయని, సోమవారం నాటికి అవి కూడా పూర్తి చేస్తామన్నారు. పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఉద్యోగుల వివరాలను నమోదు చేయడం జరుగుతుందని ఫిబ్రవరి 15వ తేదిలోపు నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించేందుకు గాను రహదారులను పరిశీలించడం జరిగిందని రహదారులకు ఎటువంటి మరమ్మత్తులను వాటిని కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డిస్పాచ్ సెంటర్, రిసెప్షన్ సెంటర్లకు ఉన్న దూరాన్ని అంచనా వెయ్యడంతో పాటు అందుకు తగిన మ్యాపులను కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. హోమ్ ఓటింగ్ ఓటర్ల పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. భద్రతకు సంబంధించి జిల్లా ఎస్పీ తో కలిసి సమీక్షించడం జరిగిందన్నారు. సెక్టార్ ఆఫీసర్లు, సెక్టార్ పోలీసు ఆఫీసర్లు ఒక విడత శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక అబ్జర్వర్ ను నియమించడం జరిగిందన్నారు. వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లాలోనే సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్/వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పూర్తి స్థాయి మొబైల్ నెట్వర్క్ ఉండేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వివరించారు.

About Author