PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టేషన్ల ను పరిశీలించిన ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  కృష్ణ మండలం నారాయణ పేట జిల్లా తెలంగాణ. జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS  మద్దూర్, కోస్గి పోలీస్ స్టేషన్లను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీసు స్టేషన్లో 5s ఇంప్లిమెంటేషన్ చేయాలని అధికారులకు  సూచించారు. పోలీసు సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకొని న్యాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని సూచించారు .  పోలీసు స్టేషన్ కి వచ్చే  పిర్యాదులు పెండిగ్లో లేకుండా చూడాలని వెంటనే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు అధికారులు సిబ్బంది కష్టపడి బాగా పనిచేయాలని, జిల్లాలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలవేళ గొడవలు సృష్టించే వారి పై నిఘా ఏర్పాటు చేయాలని, పోలీసు అధికారులు, సిబంది  బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ  తెలిపారు.అంతర్ జిల్లా సంపల్లి చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన. ఎస్పీఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంతర్ జిల్లా సరిహద్దు కోస్గి లోని సంపల్లి చెక్పోస్టు ను జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్  తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ… సాధారణ అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తన నియమ నిబంధనలు ప్రకారం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటర్లను ప్రలోభానికి గురి చేసే  అక్రమ నగదు, మద్యం, బంగారం ఇతర విలువైన వస్తువులు రవాణా జరగకుండా చెక్పోస్టుల దగ్గర భద్రత పెంచడం జరిగిందని, చెక్ పోస్ట్ల దగ్గర  వచ్చే పోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని  చెక్ పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ  సూచించారు. చెక్పోస్ట్ దగ్గర పోలీసు అధికారులు, సిబ్బందికి అన్ని సదుపాయాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సమయానికి అన్ని  అవసరాలు సమకూర్చాలని అధికారులకు సూచించారు. ఎస్పీ గారితో పాటు డిఎస్పీకే సత్యనారాయణ, సిఐ జనార్ధన్, SI లు సురేష్, శ్రీనివాసులు ఉన్నారు.

About Author