PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం

1 min read

గాయత్రీమాతా మహాయజ్ఞం

జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు..

పల్లెవెలుగు వెబ్ కమలాపురం :  మండల పరిధిలోని శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణస్వామిని దర్శించుకునెందుకు వేకువజామునుంచే భక్తులు బారులుతీరారు, ఉదయం 10.00 గం.ల నుండీ శ్రీ అనపాటి నాగరాజు గురూజీ దివ్య ఆశీస్సులతో సిద్ధ సమాధి యోగ కడప శాఖ ఆధ్వర్యంలో పంచముఖి గాయత్రి మహాయజ్ఞం దిగ్విజయంగా అశేషజనవాహినితో ప్రారంభించి, చివరిగా పూర్ణాహుతితో యజ్ఞాన్ని ముగించారు, స్వామివారికి భక్తిశ్రద్ధలతో విబరాపురం వారు తాళ భజన నిర్వహించడం జరిగింది, అలాగే పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ కోలాట బృందం వారిచ్చే కోలాటం నిర్వహించడం జరిగింది, మాఘమాసంలో హరిహర దేవతామూర్తులు నిత్య కళ్యాణ మూర్తులుగా వెలసిన ఈ ఆలయంలో శుక్ల ఏకాదశికి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవటంతో పాటు, పంచముఖి గాయత్రీ మాత మహా యజ్ఞంలో పాల్గోనటం వల్ల సకల బాధలు, సమస్యలు, తొలగి మానవాలి అందరికి సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అత్యంత శుభ ఫలితాలు చేకూరుతాయి. సాయంత్రం గరుడ వాహనంపై మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి వారిని మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు, మహాహారతి తరువాత ఆలయ ప్రధాన సేవకులు డా.కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనానికి జిల్లా నలుమూలలో నుంచి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు, భోజనాలు ఏర్పాటు చేశారు.

About Author