PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ ఆపండి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కృష్ణా జలాల‌పై అన‌వ‌స‌ర వివాదం ఆపాల‌ని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. తెలుగు ప్రజ‌లు బాగుండాలంటే.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆపాల‌ని కోరారు. అనుమ‌తులు వ‌చ్చిన త‌ర్వాతే నీటిని తీసుకెళ్లాల‌ని చెప్పారు. ఈ వ్యవ‌హారంలో ఏపీ మంత్రుల తీరు విచార‌క‌ర‌మ‌ని అన్నారు. తెలంగాణ‌లో ఏపీ ప్రజ‌ల ఆస్తుల‌కు, ప‌రిశ్రమ‌ల‌కు, ఉద్యోగాల‌కు ఎప్పుడైన ఇబ్బంది క‌లిగించామా ? అంటూ ప్రశ్నించారు. ట్యాంక్ బండ్ విగ్రహాలు తీశామా?. ఏపీ ప్రజ‌లు ఎవ‌రైనా ఫిర్యాదు చేశారా ? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రానాయ‌కుల పేర్లు ఉన్న వీధులు, కాల‌నీలు మార్చామా అని అన్నారు.

About Author