PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు వ్యాధుల పట్ల జాగ్రత్త

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థినీ విద్యార్థులు వ్యాధుల పట్ల చాలా జాగ్రత్త వహించి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కర్నూలు కళాకారుల సేవా కేంద్రం అధ్యక్షులు బైలుప్పల షఫీయుల్లా అన్నారు. ఈరోజు మధ్యాహ్నం కర్నూలు నగరం నందలి ప్రకాష్ నగర్ లో గల శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నగర పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు టూత్ బ్రష్ లు టూత్ పేస్టులు సబ్బులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సింహాద్రి విజయ్ కుమార్, ఆడిటర్ ఎస్ రహిస్ అహ్మద్, ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, రోజా వీధి సమన్వయకర్త, మీసాల సుమలత  విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు పరిశుభ్రత పాటించి మంచి విద్యనభ్యసించి గొప్ప ఆదర్శ పౌరులు గా సమాజ సేవలో నిరంతరం కృషి చేయాలని కర్నూలు కళాకారుల సేవా కేంద్రం అధ్యక్షులు బైలుప్పల షఫీయుల్లా విద్యార్థినీ విద్యార్థులకు కోరారు. సేవా కార్యక్రమ నిర్వహకులకు పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *