NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎండాకాలం.. ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా పోతుంది కాబ‌ట్టి త‌గినన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. చెమట బాగా పట్టేవారికి ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని తిరిగి భర్తీ చేసుకునేలా ఆహారం ఉండాలి. ఇలా కానప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి, వడ దెబ్బ తగలడం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరుగుతాయి. వీటిని నివారించాలంటే రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు ఏదో ఓ రూపంలో తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, భోజనంలో సాంబార్‌ లేదా రసం లేదా సూప్స్‌ తీసుకోవడం మొదలైనవన్నీ ఉపయోగ పడతాయి. నీరు అధికంగా ఉండే పుచ్చ, కర్బుజా, ద్రాక్ష వంటి పండ్లను కూడా రోజుకు ఒకటి రెండుసార్లు తీసుకుంటే మంచిది. భోజనంతో పాటు నీళ్లు ఎక్కువ ఉండే కీరా, టొమాటో, ఉల్లి మొదలైన వాటితో చేసిన సలాడ్లను తీసుకోవాలి. కారం, మసాలాలు ఉన్న ఆహారం తగ్గించాలి. నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్ళు, బేకరి ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ మొదలైనవి తగ్గించాలి లేదా మానెయ్యాలి.

                               

About Author