PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గదర్ 2.. ఈ ఆదివారం మీ జీ తెలుగులో!

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందినఛానళ్లలో ఒకటైన జీ తెలుగు తన ప్రేక్షకులను అలరించేందుకు అందివచ్చిన ప్రతిఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగుప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరో బ్లాక్బస్టర్ హిట్ని ఈ ఆదివారం కానుకగాఅందించనుంది. 2023లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన గదర్2ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా తెలుగులో ప్రసారం చేయనుంది. ఎమోషనల్ఎంటర్టైనర్ గదర్ 2, ఫిబ్రవరి 18 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో!తెలుగు ప్రేక్షకులుఎంతగానో ఎదురుచూస్తున్న గదర్ 2 సినిమాను తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారంచేయనుంది. అనిల్ శర్మ దర్శకత్వంలో 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించిన ఈ చిత్రం 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో తారా సింగ్ (సన్నీ డియోల్)ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కింది. జైలులో ఉన్న తన కుమారుడు చరణ్జీత్సింగ్ (ఉత్కర్ష్ శర్మ) ను రక్షించడానికి పాకిస్థాన్ నుంచి తిరిగివచ్చిన తారా సింగ్ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ.థియేట్రికల్ రిలీజ్సక్సెస్ తర్వాత ఫిబ్రవరి 18న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్న ‘గదర్ 2’ ప్రేక్షకులకు అదిరిపోయే వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది.కాబట్టి,తెలుగు ప్రీమియర్గా ప్రసారం కానున్నబాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా గదర్ 2ని జీ తెలుగు వేదికగా ఈ వారాంతంలో మీరూ మిస్సవకుండావీక్షించండి!

About Author