PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో పోలింగ్ 92 శాతం పెంచే లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు..

1 min read

పట్టణ ఓటర్లలో చైతన్యంకోసం ప్రత్యేక చర్యలు

 స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్భయంగా ఓటు హక్కును  వినియోగించుకునేలా ప్రజా చైతన్య కార్యక్రమాలుకు ప్రత్యేక ప్రణాళిక

స్వీప్ జిల్లా నోడల్ అధికారి & జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లాలో స్వీప్ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి మరియు స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలుతో జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలు అమలుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.ఏలూరు కార్పొరేషన్ సమావేశ మందిరంలో శుక్రవారం ‘సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ & ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్’ (SVEEP) కార్యకలాపాలు & స్వీప్ 2024 జిల్లా కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా నిర్వహించిన పట్టణ ఓటర్ల చైతన్య కార్యక్రమంలో డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ఓటర్లు అందరు ఓటు వేసి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపినిచ్చారు. 45 రోజుల స్వీప్ జిల్లా ప్రణాళిక అమలును డీపీఓ వివరించి జిల్లా  ఏథికల్ ఓటింగ్ లక్ష్యం 92% అని, అన్ని ప్రాంతాలలో  ఓటింగ్ శాతం పెరగాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో ఈ.వి.యమ్ వినియోగం, ఓటింగ్ విధానం తదితర అంశాలలో ప్రజలను చైతన్య పర్చడానికి యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా మాథ్యమాలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అనంతరం  డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ టర్నోవర్ ఇప్లిమెంటేషన్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, దానిని క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు, సహకారం తీసుకుంటున్నామని, దానిలో భాగంగా మునిసిపల్ కార్పొరేషన్, కార్మిక శాఖ సహకారంతో ఈరోజు పట్టణ ప్రాంతంలో స్వీప్ ద్వారా ఏథికల్ ఓటింగ్, ఓటింగ్ శాతం పెంచడం, ఎన్నికల విధానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో జిల్లా సగటు ఎన్నికల పోలింగ్ 86 శాతం జిల్లాలో నమోదైతే, ఏలూరు పట్టణంలో కేవలం 68 శాతం ఉండని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏలూరు అర్బన్ తోపాటు నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ప్రాంతాల్లోకూడా ఓటర్ టర్నవుట్ పెంపు లక్ష్యంగా అన్ని ప్రయత్నాలు  జరుగుతున్నాయని అన్నారు. విభిన్న ప్రతిభావంతులు నూరుశాతం ఓటు వినియోగించుకునేలా, వృద్ధాశ్రమంలో వున్నవారు ట్రాన్స్ జండర్స్ లను గుర్తించి వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చెయ్యమని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఇప్పటికే ఆదేశించ్చినందున ఆ దిశగా కార్యాచరణ చేపట్టడం జరిగిందని అన్నారు.  వయోవృద్ధులు, నడవలేనిపరిస్ధితుల్లో ఉన్నవారు, తదితరులకోసం హోం ఓటింగ్ అమలుచేసేందుకు ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేస్తున్నదని ఇందుకు సంబంధించిన  నిబంధనలు అందిన వెంటనే వాటిని తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 5 రోజులలోపు సంబంధిత పోస్టల్ బ్యాలెట్ కు ధరఖాస్తు చేసుకోవల్సియుంటుందన్నారు.స్వీప్ కార్యక్రమంలో బాగంగా చునావ్ పాఠశాల కార్యక్రమాలను జరుపుతున్నామని డీపీఓ అన్నారు. కాలేజీలలో క్యాంపస్ అంబాసిడర్లతో ఆయా నియోజవర్గ రిటర్నింగ్ అధికారులు సమావేశాలు నిర్వహించి వారికి కూడా ఈవిఎంలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్వీప్ కార్యక్రమాల అమలుపై కాలేజీలలో, మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాలలో అవగాహన కలిగించే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.  ప్రజా స్వామ్యంలో మనహక్కుల సాధనకు ఏవిధంగా పోరాడతామో అదే విదంగా ఓటుహక్కు వినియోగించుకోవడం కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. అడిషనల్ కమీషనర్ చంద్రయ్య  మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గం పరిధిలో ఓటర్ టర్నవుట్ పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.  ఓటర్లు వారి అభిష్టంమేరకు ప్రశాంతంగా సజావుగా తమఓటుహక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమీషనర్ నాగేశ్వరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

About Author