PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏసీబీ వ‌ల‌లో త‌హ‌శీల్దార్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: విశాఖ జిల్లా చోడ‌వ‌రం త‌హశీల్దార్, డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఏసీబీ వ‌ల‌లో చిక్కారు. 4.50 ల‌క్షల లంచం తీసుకుంటుండ‌గా.. రెడ్ హాండెడ్ గా ఏసీబీ అధికారుల‌కు చిక్కారు. చోడ‌వ‌రం మండ‌లం గాంధీ గ్రామానికి చెందిన చ‌ల‌ప‌తిశెట్టి, వెంక‌ట‌రామ‌కృష్ణ క‌లిసి న‌ర్సాపురంలో 1.66 ఎకరాల పొలం కొన్నారు. భూమార్పిడి కోసం కొన్నిరోజులుగా త‌హ‌శీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. త‌హ‌శీల్దార్ ర‌వికుమార్ 20 ల‌క్షల లంచం డిమాండ్ చేశారు. న‌ర్సీపట్నంలో 50 సెంట్ల భూమి క‌న్వర్షన్ చేసేందుకు డిప్యూటీ త‌హ‌శీల్దార్ రాజా 50 వేలు డిమాండ్ చేశారు. ప‌ది రోజుల క్రిత‌మే బాధితులు ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించారు. డ‌బ్బు సిద్దం చేశామ‌ని, ఎక్కడికి తీసుకురావాల‌ని బాధితులు త‌హ‌శీల్దార్ ను అడిగారు. నేరుగా తీసుకురావొద్దంటూ.. త‌న కారు డ్రైవ‌ర్ కు ఇవ్వాల‌ని చెప్పారు. బాధితులు కారు డ్రైవ‌ర్ కు డ‌బ్బు ఇచ్చారు. డ్రైవ‌ర్ నుంచి డ‌బ్బు తీసుకుంటుండ‌గా.. ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా ప‌ట్టుకున్నారు.

About Author