PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిఓఎల్ ఆర్ రీసర్వేను పగడ్బందీగా చేపట్టండి

1 min read

అధికారులను ఆదేశించిన జేసీ (రెవిన్యూ మరియు రైతుభరోసా) రామసుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: పిఓఎల్ ఆర్ రీ సర్వే కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతుభరోసా) రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని తమ ఛాంబర్ నందు జెసి రామసుందర్ రెడ్డి పిఓఎల్ ఆర్ రీసర్వే పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ పీ ఓ ఎల్ ఆర్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లాలో ఆదోని డివిజన్ కు సంబంధించి కాత్రికి, నంద్యాల డివిజన్లో నంద్యాల మండలం, బిల్లాపురం , కర్నూలు డివిజన్ కల్లూరు మండలం, పందిపాడు గ్రామం, ఈ మూడు గ్రామాలలో రీసర్వే కార్యక్రమం బాగా జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 7వ తేదీలోపు ఈ గ్రామాలలో జరిగే రీ సర్వే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత సంబంధిత రైతులకు భూ సర్వే పూర్తయిందని నోటీసులు ఇవ్వాలన్నారు.

నోటీసులు ఇచ్చిన తర్వాత రైతులు ఏవైనా అభ్యంతరాలు తెలిసినట్లయితే వెంటనే సమస్య పరిష్కరించాలన్నారు. పై మూడు గ్రామాలకు సంబంధించి సెప్టెంబర్ 7వ తేదీ తర్వాత ల్యాండ్ పార్సిల్ మ్యాప్, విలేజ్ మ్యాప్ రెడీ చేయాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కర్నూలు, ఆదోని ఆర్ డిఓలు హరి ప్రసాద్, రామకృష్ణారెడ్డి, కోనేరు రంగారావు కమిటీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

About Author