PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు టిడిపి అభ్యర్థిగా గిత్తా జయ సూర్య ..!

1 min read

నందికొట్కూరులో తెదేపాను గెలిపించి చంద్రబాబు నాయుడుకు గిఫ్టుగా ఇస్తాం :

నందికొట్కూరు తెదేపా అభ్యర్థి గిత్తా జయసూర్య

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనే తర్జనబర్జనలో ఉన్న నియోజకవర్గ ప్రజలకు , తెదేపా నేతలకు ఎట్టకేలకు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం విడుదల చేసిన రెండవ జాబితాలో  తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన గిత్త జయ సూర్య పేరును ఖరారు చేశారు.  నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకట రెడ్డిలు  గిత్తా జయసూర్య పేరును అధినేత నారా చంద్రబాబు నాయుడు వద్ద ప్రతిపాదించారు. అంతే కాకుండా పలువురు నేతలు టిక్కెట్ కొరకు ప్రయత్నాలు భారీగా చేసినప్పటికి కూడా మాండ్ర శివానందరెడ్డి మద్దతు ఉన్న గిత్తా జయసూర్య కు టిక్కెట్ కేటాయించడంతో తెదేపా నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది. జయసూర్య ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో నందికొట్కూరు నియోజకవర్గంలో  జయసూర్య కు బంధువులు, స్నేహితులు, శ్రీయోభిలాషులు ఎక్కువగా ఉండటంతో గెలుపు ఈజీగా ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.   

కుటుంబ నేపథ్యం..

నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన గిత్త సులోచనమ్మ గిత్త గాంధీల సంతానం 

గిత్త జయసూర్య. 1982 జనవరి 26న జన్మించారు. విద్యాభ్యాసం డిగ్రీ వరకు చదివారు. అనంతరం చదువు మధ్యలోనే నిలిపివేసి  కాంట్రక్టర్ గా మారారు.ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు.భార్య సరస్వతి ,

పెద్ద కుమారుడు కార్తికేయ  ఇంటర్మీడియట్ ఫస్టియర్ బైపిసి, శ్రీ శ్రీ చైతన్య జోనల్ క్యాంపస్ కర్నూల్.

చిన్న కుమారుడు ధీరజ్   8 వ తరగతి  విజయ వాణి హై స్కూల్ నందికొట్కూరు. 

రాజకీయ ప్రస్థానం..

వ్యవసాయం, అలాగే మాండ్ర శివానందరెడ్డి  కుటుంబానికి ముఖ్య అనుచరుడుగా ఉంటూ వారితోపాటు తెలుగుదేశం పార్టీలో చేరి మాండ్ర శివానందరెడ్డి  సహాయ సహకారాలతో పార్టీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ 2014 నుంచి పార్టీలో వివిధ హెూదాలలో నందికొట్కూరు తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షునిగా మరియు 2017 నుంచి 2019 వరకు దళిత తేజం ప్రధాన కార్యదర్శిగా ఎస్సీలకు వారి మౌలిక అవసరాల కొరకు పార్టీ పిలుపు మేరకు ఆ కార్యక్రమంలో వివిధ గ్రామాలను సందర్శించి దళితులకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలను ఆరోజు నందికొట్కూరు ఇన్చార్జి గా ఉన్నటువంటి మాండ్ర శివానందరెడ్డి  సహాయ సహకారాలతో ప్రతి  గ్రామం లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకు సేవ చేయడం జరిగింది. మరియు 2019 జనరల్ ఎలక్షన్లో నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బండి జయరాజు  విజయం కొరకు అలాగే నంద్యాల ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాండ్ర శివానందరెడ్డి  గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది.  పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన పోరాటం చేయడం జరిగింది, తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు విద్యుత్ సమస్యల పైన రైతులకు కరెంట్ అవసరాల నిమిత్తం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుమేరకు వివిధ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఆలాగే  నియోజకవర్గంలో ఏ సమస్యలైనా కార్యకర్తలకు ఎక్కడైనా గానీ ఏదైనా ఆపద వచ్చిందని మాండ్ర శివానందరెడ్డి  దృష్టికి తీసుకెళ్లి అలాగే మా నంద్యాల పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి గౌరు వెంకటరెడ్డి  అలాగే నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించినాక వారు చెప్పిన ఆదేశాల మేరకు మరియు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. ఈ విజయాలను  దృష్టిలో పెట్టుకొని మా ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి  నందికొట్కూరు ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి  పార్టీ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ఎస్ సి సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నియోజకవర్గమంతట సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఇది కాకుండా మన పార్టీ పిలుపుమేరకు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నియోజకవర్గం అంతట నిర్వహించడం జరిగింది. అలాగే ఈ మధ్య  జరిగినటువంటి (గాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో నియోజకవర్గం లోని కార్యకర్తల, నాయకుల కృషితో వారి విజయానికి తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ మరియు నందికొట్కూరు మున్సిపాలిటీ ఎలక్షన్లలో అభ్యర్థుల విజయం కొరకు తీవ్రంగా కృషి చేయడం జరిగింది. మీరు అనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ను అక్రమంగా అరెస్టుచేసినప్పుడు నందికొట్కూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను  ఏకం చేసి మాండ్ర శివానందరెడ్డి  తో కలిసి నందికొట్కూరు టౌన్ ను బంద్ చేయటం జరిగింది. అక్రమ రెస్టు ను నిరసిస్తూ రాస్తోరోకో చేపట్టడం జరిగింది. అక్రమ అరెస్టును నిరసిస్తూ నియోజకవర్గంలోని అన్ని మండల కేం(దాలలో మరియు నందికొట్కూరు పట్టణంలో వివిధ రూపాల్లో నిరాహార దీక్షలు చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలు అన్ని మండలాల్లో, (గామాల్లో, పట్టణంలో రిజిస్ట్రేషన్స్ చేయించడం జరిగింది. మా మాండ్ర శివానందరెడ్డి  అలాగే గౌరు వెంకటరెడ్డి  సహాయ సహకారాలతో ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం లో 51 శాతం   బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ రిజిస్ట్రేషన్స్ చేయించడం జరిగింది. ఇంకాను రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే పార్టీ ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు ముందుండి నడిపించి నిర్వహించడం జరిగింది. వీటన్నిటికీ కారణం మన నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాంధ్ర శివానందరెడ్డి  అలాగే నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి గౌరు వెంకట్ రెడ్డి  ఆశీస్సులతో  దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన అవగాహన సాగునీటి ప్రాజెక్టుల పైన , రైతులకు సంబంధించి  రైతు కూలీలకు సంబంధించి వ్యాపారస్తులకు సమస్యలు , పట్టణ సమస్యలపై కూడా అన్నిటి పైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు.

పలువురు టీడీపీ నాయకుల శుభాకాంక్షలు..

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలలో గిత్త జయ సూర్య ను అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గంలో ఉన్న తెదేపా నాయకులు, కార్యకర్తలు అందరూ జయసూర్యను అల్లూరు గ్రామానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో  నంద్యాల పార్లమెంట్ తెదేపా ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలను  విస్తృతంగా చేపట్టి, అధికార పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను  ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీ పథకాలు మేనిఫెస్టో ను ప్రజలకు వివరించి అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. నాపై నమ్మకంతో టిక్కెట్ ఇప్పించిన మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకట రెడ్డిలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా పార్టీని గెలిపించి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ తెప్పించి నారా చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇస్తామన్నారు.

About Author