PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 బాబు అక్రమ అరెస్టును ఖండించిన టిడిపి శ్రేణులు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: అరెస్టు  జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  అరెస్టుకు నిరసనగా పత్తికొండలో శనివారం టిడిపి శ్రేణులు నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.టిడిపి  నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ శ్యామ్ కుమార్  ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గం లోని ఐదు మండలాల నుంచి టిడిపి నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి నిరసన ర్యాలీలు, బైఠాయింపులు ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. టిడిపి కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను ఖండిస్తూ, సీఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు అక్కడ నుండి నాలుగు స్తంభాల కూడలి వద్దకు సాగింది. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబు  నాయుడును తక్షణమే వదిలిపట్టాలని  సైకో జగన్ పోవాలని నినాదాలు చేశారు. దాదాపు గంటపాటు నాలుగు స్తంభాల కూడలి వద్ద టీడీపీ శ్రేణులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు సైతం ఉదయం నుండి డిపోలను డిపోలకే పరిమితం కావడంతో, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కే సాంబశివారెడ్డి, రామనాయుడు, బత్తిని లోకనాథ్, ఈశ్వరప్ప, సంజన, తిరుపాలు, అశోక్ కుమార్, తిమ్మయ్య చౌదరి, సింగం శ్రీనివాసులు, సోమ్లా నాయక్, బిటి గోవిందు, సురేంద్ర, తిప్పన్నతో పాటు ఆయా మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author