PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌య‌సు ప‌దేళ్లు.. సంపాద‌న నెల‌కు కోటి రూపాయ‌లు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :ఆస్ట్రేలియాకు చెందిన చిన్నారి వ్యాపారంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ప‌దేళ్ల వ‌య‌సులోనే నెల‌కు కోటి రూపాయ‌లు సంపాదిస్తోంది. ఆమె వ్యాపార మెళకువ‌కు ప్రజ‌లు అబ్బుర‌పోతున్నారు. 10 సంవ‌త్సరాల వ‌య‌సు ఉన్న పిక్సీ క‌ర్టిస్ విజ‌యం వెనుక ఆమె త‌ల్లి పాత్ర కూడ ఉంది. పిక్సీ పుట్టగానే ఆమె పేరు మీద రాక్సీ 2011లో పిక్సీస్ బౌస్ అనే వ్యాపారం ప్రారంభించింది. ఆ తర్వాత పిక్సీస్ ఫిడ్‌జెట్స్ అనే మరో వ్యాపారం కూడా ప్రారంభించింది. పిక్సీ తన బ్రాండుతో విక్రయించే పిల్లల బొమ్మలు, పిల్లలకు అవసరమయ్యే స్టేషనరీ, సరదా గాడ్జెట్స్ వంటివాటికి ప్రస్తుతం అక్కడ మంచి డిమాండ్ ఉంది. వీటితో పాటు కొత్తగా మార్కెట్ లోకి వచ్చే బొమ్మలకు ఈ పదేళ్ల చిన్నారి రివ్యూ కూడా ఇస్తుంది. అవి ఎలా ఉపయోగించాలో, వాటి ధర ఎంతో, ఏ వయసు వారికి బాగుంటాయో చెబుతుంది. ఇలా చిన్నప్పటి నుంచే వ్యాపారంలో కిటుకులు తెలుసుకున్న పిక్సీ తన రెండు వ్యాపారాల ద్వారా ఇప్పుడు నెలకు కోటి రూపాయల దాకా సంపాదిస్తోంది.

About Author