PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవుకు రిజర్వాయర్ తిమ్మరాజు జలాశయం లో బోటు బోల్తా

1 min read

– నిందితులకు P.S Cr. No. 78/2023 U/S 304- IPC కింద కేసు నమోదు.డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె:  నియోజకవర్గం అవుకు  మండలంలో ఆదివారం సెలవు దినం కావడంతో తో విహార యాత్ర కు వెళ్లిన కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ లో స్పెషల్ బ్రాంచ్  కానిస్టేబుల్ రసూల్ కుటుంబం.ఫ్యామిలీ బోటు లో 12 మంది ప్రయాణంబోటు ను అజాగ్రత్తగా,నిర్లక్ష్యంగా నడిపినందున డైవర్ శ్రీనివాస రావు (45), బోర్డింగ్ యజమాని శ్రీనివాసులు నాయుడు(40) ఇద్దరి మీద కేసు నమోదు.2018 సంవత్సరంలో అవుకు రిజర్వాయర్  టూరిస్ట్ రెస్టారెంట్ మరియు బోర్డింగ్ కొరకు శ్రీనివాసులు అనే వ్యక్తి  ఐదు సంవత్సరాల కాలానికి అగ్రిమెంటు.కానీ సుమారు రెండు సంవత్సరాల నుండి ఏపీ టూరిజం వారికి లీజు రుసుం చెల్లించని శ్రీనివాస నాయుడు.రిజర్వాయర్లో పడవలు నడిపేటప్పుడు పడవలో డైవర్ తో పాటు ఒక హెల్పర్ ఉండాలి అందరికీ లైఫ్ జాకెట్లు సరఫరా చేయాలి మరియు పడవలో వాటర్ ట్యూబ్ లో ఉండేటట్టు చూసుకోవాలి. కానీ బోటింగ్ యజమాని డబ్బా రా శ్రీనివాసులు నాయుడు పై వాటిని పడవలో అమర్చకుండా పడవను రిజర్వాల్లో తిప్పితే నీటిలో ఏదైనా ప్రమాదం జరిగితే మనుషులు ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా బోర్డింగ్ యజమాని దుబ్బాక శ్రీనివాసులు నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా 14.05.2023 వ తేదీన ఉదయం సుమారు 10:45 గంటల సమయంలో కోవేలకుంట్ల SB హెడ్ కానిస్టేబుల్ దూదేకుల రసూల్ భాషా తన కుటుంబంతో సభ్యులు బోటింగ్ లో విహార నిమిత్తం అవుకు రిజవార్ బోర్డింగ్ వద్దకు రాగా బోటింగ్ యజమాని దుబ్బాక శ్రీనివాసులు నాయుడు 12 మంది పెద్ద వాళ్లతో డబ్బులు ఇప్పించుకొని మరియు ఇద్దరు చిన్నపిల్లలు ఇంజన్ పడవలు ఎక్కించుకొని రిజర్వాలో తిప్పుకొని రమ్మని పడవ డైవర్ శ్రీనివాసులు చెప్పగా డైవర్ శ్రీనివాసరావు ఇంజన్ పడవని నిర్లక్ష్యంగా నడుపుతూ ఉండగా పడవలోని అలల నీరు పడి పడవలో నీరు ఎక్కువ అవుతుండగా విషయం తెలుసుకున్న రసూల్ బాషా వాళ్లు చెబుతున్న డైవర్ పట్టించుకోకుండా పడవను అదేవిధంగా జాగ్రత్తగా నిర్లక్ష్యముగా నడుపుతూ పడవలో ఉన్న సక్రమమైన సూచనలు ఇవ్వకుండా ప్రమాదము జరుగుతూ ఉందని ముందుగానే ఊహించి పడవలో ఉన్నవారు చనిపోతారని తెలిసి కూడా పడవ ప్రమాదం నుండి తాను తప్పించుకోవడానికి  అని పడవలో నుండి నీటిలోకి ఒకేసారిగా దూకగా వెంటనే పడవలో గందరగోళం ఏర్పడి పడవ నీటి నందు బోల్తాపడగా పడవలో ఉన్న వారందరూ నీళ్లలో పడగా ఈత వచ్చిన వాళ్ళు మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఆడవాళ్లు చనిపోవుటకు కారకులు అయినా పడవ డైవర్ గేదెల శ్రీనివాసరావు బోర్డింగ్ యజమాని దబ్బారా శ్రీనివాసులు నాయుడు లపై కేసు నమోదు చేసినట్టు ఈ కార్యక్రమంలో ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి  సీఐ ప్రియతమారెడ్డి డోన్ DSP శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

About Author