PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా వైఎస్ఆర్ నాలుగో విడత ఆసరా కార్యక్రమం..

1 min read

నియోజకవర్గంలో36,000 వేల మంది డోక్రా మహిళలకు110.70 కోట్ల రూపాయలు అందించాం..

ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని

మహిళల ఆర్థిక అభివృద్ధి, సాధికారతకు ముఖ్యమంత్రి పెద్దపీట

వేలాదిగా పాల్గొన్న డ్వాక్రా మహిళలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వై.ఎస్.ఆర్. ఆసరా కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గంలోని 36 వేల మంది డ్వాక్రా మహిళలకు 110. 70 కోట్ల రూపాయలు అందించామని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో వై.ఎస్.ఆర్. ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ఆళ్ళ నాని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మహిళలతో పాటు నాని  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆళ్ళ నాని మాట్లాడుతూ  మహిళల ఆర్థికాభివృద్ధి,  సాధికారతకు ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని,  రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళల జీవితాలలో వెలుగులు నింపుతున్నారన్నారు. .  ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలను తెలుసుకుని వారి సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తానని, ఆనాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న  రుణాలను మాఫీ చేస్తానన్న ఇచ్చిన హామీ మేరకు  4 విడతలుగా వై.ఎస్.ఆర్. ఆసరా కార్యక్రమం ద్వారా మాఫీ చేశారన్నారు.  ప్రస్తుత సంవత్సరం 3600 డ్వాక్రా గ్రూప్ సంఘాలకు చెందిన 36 వేల  మంది మహిళలకు 27 కోట్ల రూపాయలు వై.ఎస్.ఆర్. ఆసరా పధకం కింద అందించడం జరిగిందన్నారు.

 ఏలూరు నియోజకవర్గాన్ని 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం: ఆళ్ళ నాని :

            ఏలూరు నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వీటిలో 90 శాతం పనులు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే ఆళ్ళ నాని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వారి సమస్యలను తెలుసుకున్నామని, ఈ మేరకు సమస్యల పరిష్కారానికి,  రోడ్లు, డ్రైన్లు, వంటి వివిధ మౌలిక సదుపాయాల కల్పన పనులను 500 కోట్ల రూపాయలతో చేపట్టామన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారన్నారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ మహిళల పేరుమీదే మంజూరు చేస్తున్నారని, ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. ఏలూరు నగరంలోని ప్రతీ డివిజన్లోనూ 3 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.   విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ను ఇస్తూ నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం కింద ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నారన్నారు.  సమావేశానికి ఏలూరు నగరపాలక కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ అధ్యక్షత వహించారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్,  డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, గుడిదేసి శ్రీనివాసరావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు, జాన్  మున్నుల గురునాథ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మెప్మా పీడీ ఇమ్మానుయేల్,  ఏలూరు నగరపాలక సంస్థలోని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ప్రభృతులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ళ నాని ని గజమాలతో సత్కరించారు.  అనంతరం 27 కోట్ల రూపాయల రూపక చెక్కును మహిళలకు ఆళ్ళ నాని అందజేశారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో వివిధ స్వయం సహాయక సంఘాలు  ఏర్పాటుచేసిన స్టాల్ల్స్ ను నాని ప్రారంభించారు.

About Author