PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆకలి రహిత ప్రపంచమే.. ‘మలబార్​ ’ లక్ష్యం

1 min read

రోజుకు 51వేలు పోషకాహార ప్యాకెట్ల పంపిణీ

  • ‘ మలబార్​ ’ సేవలు.. అమోఘం
  • డా. కేవీ సుబ్బారెడ్డి,   కేవీ సుబ్బారెడ్డి ఇన్సిస్ట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ

కర్నూలు, పల్లెవెలుగు:ప్రపంచంలోని పేదల ఆకలి తీర్చేందుకు మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన మలబార్​ సంస్థ అధినేత కోట్లాది ప్రజల మన్ననలు పొందిన విషయం తెలిసిందే.   ఐక్య రాజ్య సమితి సస్టెనబుల్​  డెవలప్​మెంట్​ గోల్​–2 జీరో హంగర్​ ప్రొగ్రాంకు మద్దతుగా… ప్రతి రోజు 51వేల పోషకాహార ప్యాకెట్లను గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణం, నగరంలోని పేదలకు అందించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం  31వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. మున్ముందు  ఈ సంఖ్యను పెంచుతూ… 51వేల పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేస్తామని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.   జీరో హంగర్​ ప్రొగ్రాంలో భాగంగానే మంగళవారం (మే 28న)  మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ కర్నూలు షోరూమ్​లో డా.కేవీ సుబ్బారెడ్డి ఇన్సిస్ట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ చైర్మన్​ కేవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా డా.కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రథమ శ్రేణిలో రాణిస్తున్న మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ ఆధ్వర్యంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కాలర్​ షిప్​, కరోన సమయంలో సేవా కార్యక్రమాలు, మొక్కలు పంపిణీ తదితర ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిందని, ఇప్పుడు పేదల ఆకలి తీర్చేందుకు  పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. భారత దేశంలో ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, అలాంటి వారికి స్వచ్చందంగా మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ  అన్నం ప్యాకెట్లు అందజేయడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్​లోనూ మలబార్​ సంస్థ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ కర్నూలు షోరూం హెడ్​  ఫయాజ్​, స్టోర్​ మేనేజర్​ అజీష్​ కుమార్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూరుల్లా, సుదాకర్​, వలి, హరి, ఇస్మాయిల్​ తదితరులు పాల్గొన్నారు.

About Author