PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల ఆస్తులకు భద్రతలేని ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాల్సిందే

1 min read

జనవరి 12 వరకు విధులు బహిష్కరణ 

 పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణయ్య 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  ప్రజల ఆస్తులకు భద్రత లేని నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27 /2003 చట్టము ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం  పత్తికొండ బార్ అసోసియేషన్ కార్యాలయంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ 23/2023 ను రద్దు చేయాలని  న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఈ చట్టమును రద్దు చేసే వరకు న్యాయవాదులందరూ   కోర్టు విధులను 02/01/2024 నుండి 12/01/2024 బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వలన రాష్ట్రంలో చిన్న, సన్న కారు రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. స్థానిక సివిల్ కోర్టు పరిధికి టైటిల్ లేదని, రాబోయే కాలంలో ట్రిబ్యునల్లో టైటిల్ నిరూపించుకోవాలని ప్రభుత్వము తీసుకురావడం జరిగిందని తెలిపారు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టమును రద్దు చేయాలని, లేనిపక్షంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో తీవ్రమైన ఉద్యమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘం  కార్యదర్శి  రంగస్వామి,  ఉపాధ్యక్షులు దామోదరచారి, మహేష్, రవికుమార్, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి,సురేష్ కుమార్, సత్యనారాయణ,  చంద్రశేఖర్ నాయుడు, మైరాముడు, పంపాపతి, మల్లికార్జున, రమేష్ బాబు బాలభాష,జటంగి రాజు,కాశీ విశ్వనాథ్, ప్రసాద్ బాబు, నరసింహులు, వాసుదేవ నాయుడు,అరుణ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

About Author