PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాల్పులు జరిపిన పాకిస్తాన్ ఉగ్రమూకలను బహిరంగంగా “ఉరి” తీయాలి

1 min read

విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ రోజు ఉదయం 10:00 గం.లకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్దగల మహాత్మాగాంధీ విగ్రహం ముందు జమ్ము కాశ్మీర్ లోని వైష్ణోదేవి భక్తులపై జరిపిన కాల్పులకు నిరసనగా ధర్నా మరియు దిష్టి బొమ్మ ధగ్ధం చేసిన అనంతరం విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ.జూన్ 9న జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవి( కట్రా ) నుంచి శివ్‌ఖోడికి వెళ్తున్న హిందూ భక్తుల బస్సుపై పాకిస్థాన్ పెంచి పోషించిన ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదులు చేసిన పిరికి దాడిలో 10 మంది అమాయక హిందూ యాత్రికులు మరణించారు. ఈ ఘోరమైన సంఘటన తో యావత్ భారత దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది.జమ్మూ కాశ్మీర్ చాలా కాలంగా పాకిస్తాన్  పెంచిపోషించిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది, ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత అక్కడ ప్రశాంత వాతావరనణానికి ఒక ఆశా జ్యోతి వచ్చింది, కానీ ఉగ్రవాదుల మనోబలం ఇంకా తగ్గలేదని, హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపే సంఘటనలు పెరిగాయని తెలుస్తున్నది. వీటన్నింటి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఇటువంటి దాడులు జరిగితే నేరుగా పాకిస్తాన్ పై యుధ్ధం ప్రకటించాల్సి వస్తుందని గట్టి హెచ్ఛరిక చేశారు.కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటిల మాట్లాడుతూ…. భారత దేశం లో మాన్య శ్రీ నరేంద్రమోడీ మూడవ సారి ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఇలాంటి దుస్సాహసోపేతమైన చర్యకు పాల్పడడం ద్వారా ఇస్లామిక్ ఉగ్రవాదులు దేశ సార్వభౌమాధికారానికి సవాలు విసిరారు.దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదని సదరు ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితులలోనూ అరెస్టు చేసి బహిరంగంగా ఉరి తీయాలని తద్వారా నా భారతదేశం పై ఉగ్రవాదులు కన్నెత్తి చూడడానికి భయపడేలా చేయాలని దీనికి కేంద్రప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.కర్నూలు జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ మీనుగ రాజేష్  మాట్లాడుతూ …..విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మరణించిన హిందూ యాత్రికులకు నివాళులర్పిస్తూ  ఈ దారుణమైన చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇటువంటి కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించడానికి నిర్ణయాత్మక మరియు కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జిల్లా కలెక్టర్ ద్వారా గౌరవ భారత రాష్ట్రపతిని అభ్యర్థిస్తున్నామని మరియు అటువంటి అంశాలను ప్రోత్సహించే అంతర్గత మరియు విదేశీ సంస్థల పట్ల కూడా కఠినంగా మరియు తగిన విధంగా వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నామని తేలియజేశారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ సహ కార్యదర్శులు,గూడూరు గిరిబాబు, ఈపూరి నాగరాజు,బజరంగ్ దళ్ సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయరామ్, బలోపాసనా ప్రముఖ్ రాము, ప్రసార – ప్రచార కన్వీనర్ రామకృష్ణ, నగర బజరంగ్ దళ్ నగర కన్వీనర్ తెలుగు భగీరథ, హరి, గుజరాతి సురేష్, నాగరాజు, భాస్కర్, చామిరాజు సాయినాథ్, సుశాంత్, మోహిత్, యశ్వంత్, నాగేంద్ర, కుల్దీప్ నారాయణ, అభిలాష్,రవీంద్ర గౌడ్, అయోధ్య శేషాచలపతి, బాబురావు, శివకోటి చంద్రశేఖర్, ఉపేంద్ర నాయక్, కోరుకుంట్ల సంజీవయ్య, కరణం సుధాకర్, కార్తీక్, జయప్రకాశ్ సింగ్, నవీన్, సాయి ప్రణీత్, నితిన్ రెడ్డి, జస్వంత్ రెడ్డి, అఖిల్ లక్కీ, భార్గవ్, కృష్ణ సింగ్, అనిల్ సింగ్, జగన్ సింగ్, తేజ సింగ్, శివా సింగ్, సురేష్, శివ, తొట్టెంపురి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

About Author