PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేప ధ‌ర రూ. 3 ల‌క్ష‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ జాలరికి లక్ కలిసివచ్చింది. కచిడి చేప అతడి వలకు చిక్కింది.. అది మామూలు చాప కాదు.. మగ కచిడి.. దీన్ని గోల్డెన్ ఫిష్ కూడా అంటారు. అయితే దీని ధర ఎంతో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే? చేప ఖరీదు ఇంత ఉంటుందా అని నోరుళ్లబెట్టాల్సిందే..? సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రతీరంలో ఉప్పాడకు చెందిన మత్స్యకారుడు.. వల వేయగా అనుకోకుండా అతడి వలకు 18 కేజీల మగ కచిడి చేప చిక్కింది. దీనికి వేలం పాటలో ఎవరూ ఊహించని విధంగా 2,90,000 రూపాయల ధర పలికింది. ఇది చాలా పెద్ద మొత్తం. దాదాపు మాములు చేపలు 5, 6 నెలలు అమ్మితే వచ్చే అమౌంట్ అంతా ఒక్క చేప వేలానికే వచ్చింది. దీంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

                                       

About Author