PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్-ఇన్- చీఫ్  కు సమన్లుజారీ

1 min read

రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు : కృష్ణాజిల్లా తోట్లవల్లూరు,  మండలం పెనమకూరు, ఏనుగులకోడు కాలువపై శిథిలావస్థలో ఉన్న వంతెన విషయమై నివేదికను సకాలంలో సమర్పించని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్- ఇన్ -చీఫ్ బి .బాలు నాయక్ కు సమన్లు జారీ చేస్తూ, రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని పెనమకూరు గ్రామంలో ఏనుగుల కోడు కాలవపై శిధిలావస్థలో ఉన్న పెనమకూరు వంతెననిర్మాణం విషయమై కృష్ణాజిల్లా ఉయ్యూరు కు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ధి.10.7. 2023న రాష్ట్ర లోకాయుక్త కు చేసిన ఫిర్యాదు పై విచారణ జరుగుతుంది. రాష్ట్ర లోకాయుక్త ఎదుట ది.25 .6. 2024న పెనమకూరు వంతెనకు సంబంధించిన నివేదికలతో స్వయంగా హాజరు కావలసిందిగా రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి తన ఉత్తర్వులలో ఆదేశించారు. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని పెనమకూరు గ్రామంలో ఏనుగుల కోడు కాలువపై సుమారు 25 అడుగుల ఎత్తులో ఉన్న వంద సంవత్సరాల క్రిందట నిర్మించిన వంతెనకు రెండు వైపులా దక్షిణ గోడలు పూర్తిగా పడిపోగా మరొకటి కూడా కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది .ప్రమాదపరతంగా ఉంది. తోట్లవల్లూరు మండలంలోని గ్రామాలు ఐలూరు, ములకలపల్లి, మధురాపురం ,గురువింద పల్లి, దేవరపల్లి, పాములపాటి వారి పాలెం, కళ్లెం వారి పాలెం, చాగంటిపాడు, రైతులు ఎడ్ల ఫైళ్ ట్రాక్టర్ల పై ఉయ్యూరు కెసిపి షుగర్ ఫ్యాక్టరీ కి చేరవేస్తారు. పెనమకూరు గ్రామంలో ఏనుగుల గోడు కాలువపై శిధిలావస్థలో ఉన్న వంతెన పున: నిర్మాణం నిమిత్తం నిధులు మంజూరుకు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి బి .రాజ శేఖర్ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్- ఇన్ -చీఫ్ చర్యలు తీసుకోవడానికి గానూ, రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని ,సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author