PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర బడ్జెట్ అంకెల గారడి బడ్జెట్

1 min read

ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం    జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు   

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నేడు బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి బడ్జెట్ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు విమర్శించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బాబురావు మాట్లాడుతూ ఇది బడ్జెట్ కాదని ఎన్నికల మ్యానిఫెస్టోలా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష కోట్లు కావాలని అడిగారని, కానీ ఏపికి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉందని 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయని బాబురావుప్రశ్నించారు. బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారని లైఫ్ లైన్ అన్నారు.. ఫుడ్ సేఫ్టీ అన్నారు ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరంకి ఎన్ని నిధులు ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు అంచనా ఎంతో తెలియదు 12 వేల కోట్లు రీహాబిలిటేషన్ కి కావాలి ముఖ్యమైన ప్రాజెక్టు అయితే నిధులు ఎంత ఇస్తారో చెప్పలేదని, ఓర్వకల్, కొప్పర్తి  ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారని కానీ ఈ బడ్జెట్ లో కబుర్లు మాత్రమే చెప్పారు. వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ అన్నారు ఎప్పుడు ? ఎంత అనేది క్లారిటీ లేదని ఇది పూర్తిగా బిజెపి మ్యానిఫెస్టో అని అసలు మానేసి కొసరు అన్నట్లు ఉంది ప్రత్యేక హోదా అనే అంశం ఊసే లేదని విభజన హక్కులను గౌరవిస్తాం అన్నారు విభజన చట్టంలో మొదటి అంశం హోదా అసలు విషయం పక్కన పెట్టి, ఇతర విషయాలు ఇస్తాం అంటున్నారు. మోడీ తిరుపతి సభలోలో 10 ఏళ్లు హోదా అని మాట ఇచ్చారని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అంటే మాట తప్పినట్లా ? అని ప్రశ్నించారు. పార్లమెంట్ వేదికగా ఇక హోదా లేదు అని తేలిపోయిందని ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు కానీ… హోదా మీద చెప్పడం లేదు ఇచ్చిన హామీలు కూడా క్లారిటీ లేదని ఏపి విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పిందని హోదానే ఏపికి సంజీవని అని, బీహార్ 12 మంది ఎంపీలు ఇస్తే 26 వేల కోట్లు ఇచ్చారని ఇక్కడ 25 మంది ఎంపీలను తీసుకొని ముష్టి వేస్తున్నారా అని బిజెపి మళ్ళీ మోసం చేస్తుంది అని గమనించాలి. గత 10 ఏళ్లుగా ఆంధ్రను మోసం చేస్తూనే ఉన్నారని మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారని లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చారని మోడీ మళ్ళీ మోసం చేశారు అని బాబు ధైర్యంగా చెప్పగలరా?ఈ బడ్జెట్ హర్శించేది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కళ్ళు తెరవండి బిజెపితో మద్దతు ఉపసంహరించుకోండి అని డిసిసి అధ్యక్షులు బాబురావు  హితవు పలికారు.

About Author