PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద ప్రజల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం..

1 min read

– 80 బన్నూరు సొసైటీ చైర్మన్ గా  వైవి రమణ ప్రమాణస్వీకారం.

– నవరత్న పథకాలతో  రాష్ట్ర ప్రజల అభివృద్ధి.

– శ్రమించిన పార్టీ కార్యకర్తలకే పదవులు.. 

– సిద్ధార్థ రెడ్డి కృషి అభినందనీయం..

– 67 ఏళ్ల చరిత్రలో దళితుడిని చైర్మన్ గా ఎంపిక చేసిన ఘనత సిద్ధార్థ రెడ్డిదే.

– ఓర్వలేకే వైసీపీ ప్రభుత్వం పై ప్రతిపక్షల ఆరోపణలు 

– మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల వైసిపి పాలనలో  సీఎం జగన్ మోహన్ రెడ్డి  దేశంలోనే ఆదర్శమైన పరిపాలన చేస్తున్న  పాలకుడుగా ప్రజల మన్నలను పొందుతున్నారని,  నవరత్న సంక్షేమ పథకాలతో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా  సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషి హర్షణీయమని,  ఆయన నాయకత్వంలో యువనేత ఏపీ షాప్ చైర్మన్   బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  నందికొట్కూరు నియోజవర్గంలో అభివృద్ధి పథంలో నడిపించడం  అభినందనీయమని   వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కొనియాడారు. సోమవారం జూపాడు బంగ్లా మండల కేంద్రంలోని 80  బన్నూర్ సహకార వ్యవసాయ పరపతి సంఘం  చైర్మన్ గా  వైవి రమణ, డైరెక్టర్ లుగా మల్లెపోగు సురేష్, ఖాజా హుసేన్ లచే సీఈఓ చంద్రశేఖర్ గౌడు  ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ  కార్యక్రమం వైసీపీ మండల కన్వీనర్  నాగార్జున అధ్యక్షతన ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి,  మండల అధ్యక్షురాలు సువర్ణమ్మ,జడ్పిటిసి సభ్యులు పోచ జగదీశ్వర రెడ్డి, వైసీపీ మండల సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి లు హాజరయ్యా రు. నూతన సింగిల్ విండో చైర్మన్ గా ఎంపికైన వైవి రమణ ను మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి,  వైసీపీ నాయకులు పూలమాలతో ఘనంగా సత్కరించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లబ్బీ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్ల వైసీపీ పాలనలో  పేదరిక  నిర్మూలననే ధ్యేయంగా ప్రవేశపెట్టిన నవరత్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ఇంతటి ఘనమైన పాలన కొనసాగిస్తున్న చరిత్ర రాష్ట్రంలో మునుపేన్నడు లేదని వారు కొనియాడారు.  జూపాడుబంగ్లా మండల కేంద్రంలో 80 బన్నూరు సహకార వ్యవసాయ పరపతి సంఘం ఏర్పడిన నాటినుండి 67 సంవత్సరాల కాలంలో దళితుడికి చైర్మన్ గా అవకాశం దొరకలేదన్నారు.  కానీ నేడు వైసీపీ పాలనలో పార్టీలో అహర్నిశలు  కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు అందులో బడుగు బలహీన వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఇవ్వడం అది జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు.  నేడు షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో సొసైటీ చైర్మన్ పదవి ఓ దళితుడు  ఎంపిక కావడం హర్షించదగిన విషయమన్నారు. మాజీ సర్పంచ్ గా ప్రజలకు చేసిన సేవను,  పార్టీ అభివృద్ధి కార్యకర్తగా శ్రమించడం వల్లే  రమణకు చైర్మన్ అవకాశం దొరికిందన్నారు. ఈ అవకాశాన్ని మండల రైతన్నల సంక్షేమ కోసం కృషి చేయాలని ఆయన నూతన పాలకమండలి సభ్యులను,  చైర్మన్ వై.వి.రమణకు సూచించారు.  అదేవిధంగా  వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో నేటికీ ఆదరణ తగ్గ పోవడంపై ప్రతిపక్షాలు ఓరువలేకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై బురదజల్లే కార్యక్రమం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్న సీఎం జగనన్న ప్రభుత్వాన్ని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వాన్ని  ఆదరించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author