PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి

1 min read

పల్లెవెలుగు న్యూస్ గడివేముల :  బుధవారం నాడు రాజధాని అమరావతిలోఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లను మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి ఎస్. మంజుల వాణి పరిశీలించారు. ఏపీ ఫైబర్ నెట్ అందుబాటులో ఉండటంతో దాదాపు 250 మంది ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం చూసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. గడివేములలోని థియేటర్ ను పరిశీలించారు థియేటర్లో ఏపీ ఫైబర్ నెట్ సౌకర్యలను థియేటర్ యజమానితో అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వ భవనాలకు విద్యుత్ అలంకరణ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరానికి నియోజకవర్గం  నుంచి నాలుగు బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేశారని, ప్రతి మండలానికి ఒక్కో బస్సు చొప్పున దాదాపు 30 మంది వెళ్లొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివరాం రెడ్డి, ఈ ఓ ఆర్ డి ఖాళీక్ బాషా, ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author