PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

– దిక్కుతోచని స్థితిలో రైతులు… అప్పులపాలవుతున్న వైనం
– కలగానే.. టమోటా జ్యూస్​ ఫ్యాక్టరీ ?
పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలో రైతులు సాగు చేసే ప్రధాన పంట టమోటా. దశాబ్ధాల తరబడి ఇక్కడ టమోటా జ్యూస్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజా, రైతు సంఘాలు ఎన్నో ఆందోళన, ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోతోంది. దీంతో ఏడాదికేడాది రైతన్నలు నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా యధావిధిగా చేతికొచ్చిన టమోటా పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో.. భారీస్థాయిలో సాగు చేసిన పంటను రోడ్లపై పడేయాల్సిన దుస్థితి నెలకొంది.

హామీలు.. నీటిలో బుడగలే..
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతులు, కూలీలకు టమోటా జ్యూస్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అధికారం వచ్చిన తరువాత ఫ్యాక్టరీ ఊసే ఎత్తడంలేదు. ఓ వైపు దళారీ వ్యవస్థ రాజ్యమేలుతున్నా… ఎవరూ పట్టించుకోవడంలేదు. రోజు రోజుకు పంట ధర పతనమవుతుండటంతో .. సాగు కోసం చేసిన అప్పుల ఊబిలో రైతులు కూరుకుపోతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు కళ్ళు తెరిచి ఈ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

About Author