PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

16న దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మె జయప్రదం చేయండి

1 min read

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు

సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :   ఎమ్మిగనూరు పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు,నిరుద్యోగ, విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మిగనూరు పట్టణంలో సోమవారం రోజున సంయుక్తా కిసాన్ మోర్చా,కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్జీవో భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని.ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ ఎంఎల్ (డెమోక్రసీ) న్యూ డెమోక్రసీ నాయకులు రాజు అధ్యక్షత వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు రైతు సంఘం నాయకులు పంపన్నగౌడ్, హనుమంతు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీంవలీ,టిడిపి నాయకులు సుందర్ రాజ్, దయాసాగర్ సిపిఐ నాయకులు రంగన్న, పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా మోసగిస్తుందని వ్యవసాయం పరిశ్రమలు ఘనులు విద్యుత్తు అటవీ సంపదలను రవాణా బ్యాంకులో ఎల్ఐసి తదితర సంస్థలన్నిటిని ఆదాని అంబానీ తదితర కార్పొరేట్ కంపెనీలకు అప్పు చెప్పడం జరిగిందని వారు తెలిపారు. కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్లు తెచ్చిందని రైతంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిన మరొక రూపంలో వాటిని అమలు చేయాలని చూస్తుందని, విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ముందు పెట్టి కార్పొరేట్ కంపెనీలకు రాయచలి ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజలకు నిత్యం జిఎస్టి పేరుతో పనులు పెంచిందని గత 15లో బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాల పట్ల ఆదానే అంబానీలు ప్రపంచ కుబేర జాబితాలో చేరగా పేద రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు 1,50,000 మంది బలవన్మరణం  పాలయ్యారని వారు తెలిపారు. బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి మరింత ద్రోహం చేసిందని ప్రత్యేకహోదా నిరాకరించింది వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడం లేదని జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం పునర్వాసం తమకు సంబంధం లేదంటుందని రైల్వే జోన్ కు ఎగనామం పెట్టి కడప ఉక్కు పరిశ్రమ ఇవ్వకపోగా తెలుగు ప్రజల పోరాడి సాధించుకున్న విశాఖ ఫ్యాక్టరీ అమ్మడానికి పెట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక,వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధాలను ప్రతిఘటించాలని రైతు కార్మిక ప్రజాసంఘాల విధానాలపై పోరాడాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సమయుక్త కిసాన్ మోర్చుల పిలుపు లో భాగంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని  వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు తిమ్మ గురుడు,ప్రసాద్, రాముడు,ఏసోపు,రైతు సంఘం నాయకులు చిన్నన్న,జబ్బార్, శాంతప్ప,అబ్దుల్లా,హనీఫ్, గిడ్డయ్య, టిడిపి నాయకులు రంగస్వామి గౌడ్,రాందాస్ గౌడ్, ఎంపీ జే నాయకులు మరియు విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాజేష్,రంగస్వామి, వీరేశు,రాజీవ్,విజయేంద్ర, సురేష్, మహేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

About Author