PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ‌య్ `బీస్ట్` నిషేధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన చిత్రం ‘బీస్ట్’. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టెర్రరిజం ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఇందులో విజయ్ ‘రా’ ఏజెంట్‌గా నటించాడు. దీంతో ఈ చిత్రాన్ని కువైట్‌లో ప్రదర్శంచకుండా బ్యాన్ విధించారు. దీనికి సంబంధించి ఓ అభిమాని చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ‘కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ బీస్ట్ మూవీని బ్యాన్ చేసింది. దానికి కారణం.. సినిమాలో పాకిస్తాన్ గురించి, టెర్రరిస్ట్‌లను, వయెలెన్స్‌ని చూపించడం కావొచ్చు. గతంలో కురుప్, ఎఫ్‌ఐఆర్ వంటి భారతీయ సినిమాలపై సైతం కువైట్‌లో నిషేధం విధించారు. ఇలాంటి విషయాల్లో కువైట్ సెన్సార్ చాలా ఖచ్చితంగా వ్యవహారిస్తోంది’ అంటూ రాసుకొచ్చాడు.

                             

About Author