PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోండి

1 min read

– సీఐ పార్థసారథి

చెన్నూరు, పల్లెవెలుగు: గ్రామీణ ప్రాంతాలలో బేశజాలకు వెళ్లకుండా అన్నదమ్ముల వలె కలసి మెలసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ పార్థసారథి అన్నారు, మండలంలోని కొక్కరాయపల్లె గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం   ప్రజలకు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగం, గ్రామాలలోని చిన్నచిన్న గొడవలు దానిపై వచ్చే సమస్యల గురించి అవగాహన కల్పించడం జరిగింది, పచ్చని పల్లెల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని సమస్యలు పెంచుకోకుండా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఎలాంటి సమస్యలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన కొక్కరాయపల్లి గ్రామస్తులకు  సూచించారు, ఏవైనా సమస్యలే ఉంటే మీ గ్రామానికి ఏఎస్ఐ ఆంజనేయులు, అలాగే హెడ్ కానిస్టేబుల్స్, వీఆర్వోలు అందుబాటులో ఉంటారని వారు మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు, అంతే తప్ప మీరెవరు కూడా వివాదాలకు వెళ్లకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాలని ఆయన తెలిపారు, మీ భూ సమస్యలు, చిన్న చిన్న గొడవలు ఏవైనా ఉన్నచో వాటి పరిష్కారానికి అటు రెవెన్యూ, ఇటు పోలీస్ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారని ఆయన తెలిపారు, అనంతరం ఆయన గ్రామంలో పల్లెనిద్ర చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితోపాటు రెవిన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author