తప్పుడు కేసులు పెడితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం…
1 min read
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఎస్సీ, ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీస్ మీద తప్పుడు కేసులు పెడితే తీవ్రంగా వ్యతిరేకిస్తామని, మహిళా అధ్యక్షురాలు నల్లగంటి వెంకట పద్మావతి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 4 స్తంభాల సెంటర్ యూనియన్ బ్యాంక్ , దగ్గరలో రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, ముస్లిం మైనారిటీస్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన రాష్ట్ర మాల మహానాడు , అనుబంధ సంఘాల అధ్యక్షులు డాక్టర్ సేవా నాగ జగన్ బాబురావు మీద కైకలూరు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఆయన కొడుకులు, అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, అన్నారు. బాబురావు కమిటీలో నేను ఒక రాష్ట్ర అధ్యక్షు రాలినిగా ఒక బీసీ యాదవ కులానికి చెందిన నేను రాష్ట్రంలో 26 జిల్లాలలో ,ఇచ్చిన పదవి ద్వారా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ,మరి బాబు రావు చెబితే నేను గాని రాష్ట్రంలో 26 జిల్లాలలో ఉన్నటువంటి ,మా కమిటీలు అందరూ కూడా ఏ రాజకీయ పార్టీకి బాబురావు , ఓట్లు వేయమంటే ఆ పార్టీకి ఓట్లు వేస్తామని, అటువంటి వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అన్నారు గతంలో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ పార్టీకి బాబురావు సపోర్ట్ చేసి మా అందరిని కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేయమని ,జగన్ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పినటువంటి వ్యక్తి మీద అదే పార్టీ ఎమ్మెల్యే కైకలూరు నియోజకవర్గంలో ఒక్క ఎస్సీల మీదే కాదు ఎస్టీ ,బీసీ ,ముస్లిం మైనారిటీల మీద కూడా చాలా తప్పుడు కేసులు పెట్టినట్టుగా, మా దృష్టికి వచ్చిందని అన్నారు. . రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎస్సీ, ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా కైకలూరు రావడానికి సిద్ధంగా ఉన్నామని, వెంకట పద్మావతి అన్నారు.. ఈ కార్యక్రమంలో విజయవాడ డివిజన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ,,,ముస్లిం మైనారిటీస్, అధ్యక్షురాలు సందాక. రమాదేవి ,నల్లగంటి .విజయ్ కుమార్ ,కొల్లబోయిన. వెంకటేశ్వరరావు, బర్ల. ఉమామహేశ్వరి, నల్లగంటి .కళ్యాణి కొట్టు .రాజేష్ ,మరియు పద్మావతి కమిటీ సభ్యులు అభిమానులు, తదితరులు ,పాల్గొన్నారు.