PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ లో ఉన్న ధ‌న‌వంతుల సంఖ్య ఎంతంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలోని అత్యంత ధ‌న‌వంతులున్న ఉన్న ప్ర‌దేశంగా హైద‌రాబాద్ పేరొందింది. దేశంలోనే అత్యంత ధ‌న‌వంతులు ఉన్న రెండో న‌గ‌రంగా నిలిచింది. రూ.225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తుల ఉన్న వ్యక్తుల ఆధారంగా దేశంలో ఎంత మంది ధనికులు ఉన్నారనే అంశంపై నైట్‌ ఫ్రాంక్‌ ఓ నివేదికను తయారు చేసింది. ఆల్ట్రా హై నెట్‌ వర్త్‌ ఇండివ్యూజివల్స్‌-2021 పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో ధనికుల జాబితాలో హైదరాబాద్‌ రెండో​ స్థానాన్ని కైవసం చేసుకుంది. నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌లో హైదరాబాద్‌ లో 467 మంది వ్యక్తులు రూ.225 కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. 2026 సంవత్సరానికి ఆ వ్యక్తుల జాబితా 56శాతం వృద్దితో 728కి చేరనున్నట్లు హైలెట్‌ చేసింది. ఇక ముంబై 1596 మంది ధనికులతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పూణేలు ఉన్నాయి.

                    

About Author