PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎలాంటి వంట‌నూనె వాడాలి ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మారుతున్న జీవ‌న శైలితో పాటు ఆహార అలవాట్లు కూడ మారుతున్నాయి. ప్ర‌జ‌ల్లో ఆహారం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరుగుతోంది. ఎప్పుడు ఏం తినాలి ?. ఎం తిన‌కూడ‌దు. ఎలా తినాలి ? . ఎంత తినాలి ? అన్న స్పృహ పెరుగుతోంది. ముఖ్యంగా విద్యాధికుల్లో ఈ ర‌క‌మైన జీవ‌న‌శైలి ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగింది. దీంతో ఎలాంటి వంట‌నూనెలు వాడాల‌న్న ఆస‌క్తి అంద‌రిలో పెరిగింది. వంట‌నూనెలు కూడ సంపూర్ణ ఆహారంలో భాగ‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అయితే త‌గినంత మోతాదులో మాత్ర‌మే వాడాల‌ని సూచిస్తున్నారు. గానుగ నూనెల్లో ఆరోగ్యానికి మంచిచేసే విటమిన్‌ – ఇ, పాలీఫినాల్స్‌ అధికంగా ఉంటాయి. మార్కెట్లో దొరికే సన్‌ ఫ్లవర్‌, వేరుశెనగ, సోయాబీన్‌ మొదలైన రిఫైన్ట్‌ నూనెలు తగుమోతాదులో తీసుకుంటే హాని జరగదు. సాధారణంగా ఈ నూనెలు రిఫైనింగ్‌ చేసేటప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చెయ్యడం, కొన్ని రకాల రంగు, రుచి, వాసనను ఇచ్చే పదార్థాలు తొలగించడం చేస్తారు. ఈ రిఫైనింగ్‌ చేసేప్పుడు విటమిన్‌ ఈ, ఒమేగా-3 ఫాటీఆసిడ్స్‌, ఫైటోస్టెరాల్స్‌ లాంటి కొన్ని రకాల పోషకాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కానీ మార్కెట్లో లభించే పేరు కలిగిన బ్రాండ్ల రిఫైన్డ్‌ ఆయిల్స్‌ అన్నింటిలో ఈ పోషకాలన్నింటిని ప్రాసెసింగ్‌ తరువాత తిరిగి నూనెలో కలుపుతారు. నూనెలో చేసిన పిండివంటలు మానెయ్యడంతో పాటు, కూరలో, తాలింపుల్లో తక్కువ నూనె వాడుకోవడం లాంటివి చేస్తే రిఫైన్డ్‌ ఆయిల్స్‌ వాడినా కూడా పర్వాలేదు. సలాడ్లలో వేసుకోవడానికి మాత్రం ఆలివ్‌ ఆయిల్‌, అది కూడా తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది.

                                    

About Author