PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమెరికాలో అంద‌రి కంటే పెద్ద రైతు ఎవ‌రంటే..?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అమెరికాలో అతి పెద్ద రైతు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. బిల్ గేట్స్, అత‌ని భార్య మిలిందా గేట్స్ కు అమెరికాలో 18 రాష్ట్రాల్లో వ్యవ‌సాయ భూములు ఉన్నాయి. దాదాపు 2 లక్షల 69 వేల ఎక‌రాలు వీరిద్దరి పేరు మీద ఉన్నాయి. ఆ భూముల్లో బియ్యం, సోయా బీన్, ప‌త్తి, బంగాళ‌దుంప‌లు, మొక్క జొన్న పండిస్తారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో వ్యవ‌సాయం చాలా ముఖ్యమ‌ని, అటవీ విస్తీర్ణం త‌గ్గుద‌ల‌ను నివారించ‌వ‌చ్చని గేట్స్ చెబుతారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆహార కొర‌త నివారించ‌డానికి వ్యవసాయ రంగం మీద దృష్టి సారించ‌డం ముఖ్యమ‌ని చెబుతున్నారు. వ్యవ‌సాయ భూముల మీద బిల్ గేట్స్ భారీగానే పెట్టుబ‌డులు పెట్టారు.

About Author