PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా పై ట్రోల్స్ చేయిస్తున్న హీరో ఎవరో తెలుసు !

1 min read

పల్లెవెలుగువెబ్ : జిన్నా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంలో మంచు ఫ్యామిలీపై జరుగుతున్న ట్రోల్స్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ ట్రోల్స్ వెనుక ఒక హీరో ఉన్నాడని కొంత కాలంగా విష్ణు చెబుతూ వస్తున్నాడు. అందువలన ‘ఆ హీరో ఎవరో బయటపెట్టే ఉద్దేశమేదైనా ఉందా?’ అంటూ ఆయనను అడిగారు. అందుకు విష్ణు స్పందిస్తూ .. ‘మా’ ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తున్నానని చెప్పిన దగ్గర నుంచే ట్రోల్స్ మొదలయ్యాయి. ఒక మేధావి కూర్చుని మనుషులను పెట్టి చేయిస్తున్నాడు .. చేయిస్తూనే ఉంటాడు కూడా. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ప్రముఖ హీరో ఇదంతా చేయిస్తున్నాడని నేను చెబుతూ వస్తున్నాను. ఆ హీరో ఎవరనేది ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. మీడియావారికి కూడా తెలుసు. ఆ హీరో ఎవరిరో తెలియదని ఎవరైనా అంటే వారు ట్రెండ్ లో లేనట్టు” అన్నాడు.

            

About Author