PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ మద్యం, నాటుసారాపై విస్తృత దాడులు …

1 min read

పల్లెవెలుగు వెబ్​: అక్రమంగా నాటుసారా తయారీ , నిల్వ ,  అక్రమ మద్యం, అక్రమ రవాణా,  అమ్మకాలపై గత వారం  రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం, సెబ్ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా దాడులు చేశారని  జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు బుధవారం ఒక ప్రకటనలో వివరాలను విడుదల చేశారు.  జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు జిల్లా పోలీసులు  సమిష్టిగా నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు .

 నాటుసారా తయారుచేసే 21 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.

 వారం రోజులుగా.. విస్తృత దాడులు

1.         నాటుసారా పై విస్తృతంగా దాడులు.

నాటుసారా పై  13  కేసులు, 14 మంది అరెస్టు , 89.5 లీటర్ల నాటుసారా  సీజ్ , 435  లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం , 150  కేజీల బెల్లం సీజ్ , 1 బెల్లం వ్యాపారి అరెస్టు, 2  వాహనాలు  సీజ్ చేయడం జరిగింది.

2.         అక్రమ(తెలంగాణ, కర్ణాటక) మద్యం రవాణ పై దాడులు…

అక్రమ మద్యం పై  41  కేసులు, 54 మంది అరెస్టు , 1591.7 లీటర్ల  మద్యం  సీజ్, 10 వాహానాలు సీజ్.

3. బైండ్ ఓవర్ కేసుల వివరాలు…

నాటు సారా  పై  2  మందిని బైండోవర్ చేయడం జరిగింది.

అక్రమ మద్యం పై  4 మంది ని బైండ్ ఓవర్  చేయడం జరిగింది.

నాటుసారా పై విస్తృతంగా గ్రామాలలో ఆర్ ఎస్సై , 12 మంది స్పెషల్ పార్టీ పోలీసులచే దాడులు చేస్తున్నామన్నారు.

ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ ,  అక్రమంగా మద్యం  రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్టులు కూడా నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ  సిద్దార్థ్ కౌశల్ ఐపియస్  ఈ సంధర్బంగా తెలిపారు.

About Author