PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళల అభివృద్ధికి కృషి చేస్తా : టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లో మహిళల అభివృద్ధి కోసం తన సహకారాలు ఎప్పటికీ ఉంటాయని కర్నూలు టిడిపి ఇంచార్జి టిజి భరత్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మౌర్య ఇన్ లో నిర్వహించిన సిబిఎన్ కనెక్ట్ కార్యక్రమంలో ఆయన మహిళలతో కలిసి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కర్నూలును ఎలా అభివ్రుద్ది చేయాలో చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేను చేస్తే మహిళలతో పాటు అన్ని వర్గాలకు మేలు చేసేలా విజన్ తో పని చేస్తానని భరత్ హామీ ఇచ్చారు. ఇంతవరకు కర్నూలుకు ఎవ్వరూ చేయనంత డెవలప్మెంట్ చేస్తానన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిజి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు అహర్నిశలు కష్టపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు ముంతాజ్, జకియా అక్సారీ, టివి రాజ్యలక్ష్మి, సంజీవ లక్ష్మి, మారుతీ శర్మ, నేతలు గున్నామార్క్, హనుమంతరావు, నాగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

About Author