PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అప్పుల బాధ‌తో.. రైతు కుటుంబంలో ఆరుగురి దుర్మర‌ణం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న‌మ్ముకున్న పంట చేతికి రాలేదు. చేసిన అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. పెట్టుబ‌డి పెడితే.. లాభం రాక‌పోగా.. పెట్టుబ‌డి కూడ చేతికి రాకుండా పోయింది. ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఓ రైతు కుటుంబం బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడింది. యాదాద్రి జిల్లా దోర‌న హ‌ళ్లికి చెందిన భీమ‌రాయ‌, శాంత‌మ్మ భార్యభ‌ర్తలు. వీరికి న‌లుగురు సంతానం. సంప్రదాయ పంట‌ల్లో న‌ష్టం వ‌స్తుండ‌టంతో.. అప్పులు చేసి పెట్టుబ‌డి పెట్టి ఉద్యాన‌వ‌న పంట‌లు సాగు చేశారు. అప్పుల‌కు వ‌డ్డీలు పెరిగిపోయాయి. సాగు అచ్చిరాలేదు. దీంతో అప్పుల భారం పెరిగింది. చేసేది లేక కుటుంబం మొత్తం ఆత్మహ‌త్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి నుంచి భీమ‌రాయ కుటుంబం క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. దోర‌న‌హ‌ల్లి స‌మీపంలోని నీటికుంట‌లో బ‌ట్టలు క‌నిపించ‌డంతో పోలీసులు అక్కడ గాలించారు. నీటి కుంట‌లో నుంచి నాలుగు మృత‌దేహాల‌ను వెలికితీశారు. మ‌రో రెండు మృత‌దేహాల కోసం గాలిస్తున్నారు.

About Author