PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్న ..

1 min read

దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డివిఆర్ కె చౌదరి

నియంత పోకడలు నచ్చకే పార్టీకి రాజీనామా

ఆయన బాటలో పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నుండి పైదలుకుతున్నట్లు  దెందులూరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డి.వి.ఆర్.కె చౌదరి మంగళవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలసాని ఉదయ్ కిరణ్,  దెందులూరు నియోజక వర్గం లో దెందులూరు. పెదపాడు. పెదవేగి.ఏలూరు మండలాల అధ్యక్షులు కంచర్ల గంగాధరరావు. మిడతా వెంకటేష్. నందిపాము కృపావరం. నిమ్మలూరి రాజీవ్ కుమార్. సోషల్ మీడియా కో-ఆర్డీ నేటర్ నరహరి శెట్టి మహేష్ ,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సి హెచ్ పవన్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్ లు కాంగ్రెస్ పార్టీప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పి సి సి అధ్యక్షరాలు వై ఎస్ షర్మిల రెడ్డి నియంత పోకడలు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజినామా చేశామని ఏలూరులో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం వసంత మహల్ మహల్ సెంటర్లో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టారు.

About Author