PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలు ఎంతోశక్తిమంతులు.. : జేసీ(ఆసరా) పద్మావతి

1 min read

 పల్లెవెలుగు వెబ్​,ఏలూరు:  మహిళలు ఎంతో శక్తి వంతులు అన్నిరంగాలలో తనదైన ముద్రవేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి పి.పద్మావతి కోరారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి పి.పద్మావతి అధ్యక్షతన జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు చొరవగా ముందుకు వచ్చినప్పుడే ఆర్ధిక స్వావలంబన దిశగా ఆడుగులు వేయగలుగుతాం అన్నారు. సమాజంలో ఎదరైయ్యే సవాళ్ళను అదిగమించుకుని ముందుకు చొచ్చుకుపోవడాన్ని ప్రతి మహిళా అలవాటు చేసుకోన్నప్పుడు విజయాలకు చేరువ కాగలమన్నారు. తల్లి, భార్య, సోదరి ఇలా ఎన్నెన్నో పాత్రలు పోషిస్తున్న మహిళ సమాజాన్ని సన్మార్గంలో నడపడానికి కీలక పాత్ర పోషించగలదన్నారు. ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలకు కట్టుబాట్లు, విలువలు, సంస్కారం నేర్పించిననాడే సమాజంలో క్రమశిక్షణతో పాటు మహిళా సమానత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. మనం మహిళలం పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలలో రాణించలేం అనే భావాన్ని విడనాడి ఒక చిన్న ప్రయత్నంతో మొదలు పెడితే మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుందన్నారు. పాశాత్య దేశాలతో పోల్చితే మన దేశంలోని మహిళలు బహుముఖ విధులను నిర్వహిస్తున్నారన్నారు. స్త్రీ,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి కె.విజయ కుమారి మాట్లాడుతూ చదువుతోనే మహిళలు ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. కుటుంబంలో హెచ్చుతగ్గులు వుంటాయని సర్దుకుపోయే తత్వం ఉంటే కుటుంబంలో ఆనందంతో పాటు స్త్రీ ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలద్వారా మాతా, శిశు మరణాలు తగ్గుదలతోపాటు, భ్రూణ హత్యలను  నివారించగలు గుతున్నామన్నారు. మహిళా చట్టాలపై ప్రతి ఒక్క మహిళ అవగాహన కలిగివుండాలన్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీమతి రాజకుమారి బృదంచేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బి.సి సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు శ్రీమతి ఎన్.పుష్పలత, బి.సి వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి నాగరాణి, అడిషనల్ డిఎం& హెచ్ఓ శ్రీమతి డా.సుచిత్ర, సిడిపిఓలు చింతలపూడి, బుట్టాయిగూడెం శ్రీమతి కె.విజయలక్ష్మి, విజయ ఫ్లోరా, డిసిపిఓ శ్రీమతి చక్రవేణి మహిలను జాగృతం, దిశానిర్దేశం చేసేలా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు, అంగన్ వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, అంగన్‌వాడీకి వచ్చే పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు

About Author