PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహ వేడుకలో వైసీపీ నేత చంద్రమౌళి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతులపాడు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య కుమారుడు నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు వై చంద్రమౌళి హాజరయ్యారు. గ్రామానికి చెందినఆర్య సుగుణమ్మ,చిన్న చిన్నయ్య కుమారుడు ఆర్య సురేష్,భానుముక్కల గ్రామానికి చెందిన స్రవంతి ల వివాహం సోమవారం మధ్యాహ్నం ఘనంగా జరిగినది.ఈ వివాహానికి ముఖ్య అతిథిగా చంద్రమౌళి హాజరై వధూ వరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా ఎంపీపీ సువర్ణమ్మ, పోతులపాడు గోపాల్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ డాలు మునిస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author