PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జన జాతర లా రోడ్ షో

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల:  గోనెగండ్ల మండలం నేరుడుప్పల ,పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె, ఎర్రబాడు, గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక   రోడ్ షో.తేదీన సాయంత్రం గోనెగండ్ల మండలం నేరుడుప్పల, పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె, ఎర్రబాడు,  గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి జన జాతర లా రోడ్ షో నిర్వహించారు. బుట్టా రేణుక  మాట్లాడుతూ బీసీ మహిళ అయిన నాకు మీరు నన్ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే మీరందరి సహాయ సహకారాలతో  అభివృద్ధికి కృషి చేస్తానని, రోడ్లు, డ్రైనేజీలు,వాటర్ సమస్యలు జగనన్న దృష్టికి తీసుకెళ్లి శాశ్విత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే  ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు.ఈ ప్రచారంలో ఎమ్మిగనూరు మండల అధ్యక్షుడు బి.ఆర్ బసిరెడ్డి, గోనెగండ్ల మండలం నాయకులు, సర్పంచులు ,ఎంపిటిసిలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *