PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డాక్టర్ సుధీర్ గెలుపు కోసం శాప్ చైర్మన్ ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు (మిడుతూరు): నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్ గెలుపు కోసం శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోడ్ షోలో భాగంగా డాక్టర్ సుధీర్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు.బుధవారం నందికొట్కూరు మండలంలోని దామగట్ల,వడ్డెమాను,కోనేట మ్మపల్లి,శాతనకోట,కొనిదేల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.ముఖ్యమంత్రి జగనన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందని మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్ని వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి దరికి చేరుస్తూ ఉన్నారని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ మరియు ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డికి మీ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సిద్ధార్థ రెడ్డి ప్రజలను కోరారు.తర్వాత నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నాకు జగనన్న అవకాశం కల్పించారని ఈనెల 13న జరిగే ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ అన్నారు.ముందుగా ఆయా గ్రామాల్లో సిద్ధార్థ రెడ్డికి మరియు డాక్టర్ సుధీర్ కు గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు వై చంద్రమౌళి,ఎంపీపీ మురళీకృష్ణా రెడ్డి,జెడ్పిటిసి కలిమున్నిసా,ఎంపీటీసీ దేవమ్మ,అశోక్ రెడ్డి,కట్ట రవికుమార్ రెడ్డి,శేఖర్ రెడ్డి,ఎల్లాల అశోక్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *